Saturday, April 20, 2024

హుజురాబాద్ ఉప ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్ ఉప ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆగస్టు రెండో వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, అసోం, మణిపూర్, మధ్యప్రదేశ్, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలను భర్తీ చేయడానికి ఉప ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సుమారు 50 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

మరోవైపు దేశంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడంతో ఎన్నికలు నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని ఈసీ భావిస్తోంది.  గత కొన్ని రోజులుగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మినహా తక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ సన్నాహాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈటల రాజీనామా అనంతరం అన్ని పార్టీలు హుజురాబాద్ పై దృష్టి పెట్టాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ మాత్రం ఇంకా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారా? లేక వేరే అభ్యర్థిని బరిలో దింపుతారా? అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement