Thursday, April 25, 2024

మ‌రోసారి క‌లిసి న‌టించ‌నున్న విజయ్, విజ‌య్ సేతుప‌తి

మాస్ట‌ర్ చిత్రంలో త‌మిళ స్టార్ హీరోలు విజ‌య్, విజ‌య్ సేతుప‌తి క‌లిసి న‌టించారు. ఈ మూవీ సూప‌ర్ డూప‌ర్ హిట్ట్ అయింది. కాగా మ‌రోసారి వీరిద్ద‌రూ తెర‌పై సంద‌డి చేయ‌నున్నార‌ట‌. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మాస్టర్’ కూడా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ సినిమాలో హీరోగా విజయ్ .. విలన్ గా విజయ్ సేతుపతి నువ్వా.. నేనా.. అన్నట్టుగా తలపడ్డారు. విజయ్ తో పాటు సమానమైన క్రేజ్ ను విజయ్ సేతుపతికి కూడా తెచ్చిపెట్టిన సినిమా ఇది. అలాంటి ఈ కాంబినేషన్లో మరో సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే లోకేశ్ కనగరాజ్ కథ వినిపించడం .. విజయ్ .. విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. నిర్మాతగా కలైపులి థాను నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట‌. మ‌రి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తెర‌కెక్క‌నుందో.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement