Thursday, May 2, 2024

ఉపాధ్యాయ సంఘాలపై పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ ఆగ్రహం

ఉపాధ్యాయ సంఘాలపై పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేశామన్నారు. బుధవారం సచివాలయంలో నాలుగు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య వారథిలా పనిచేశామని జేఏసీ నేతలు అన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతల ఆరోపణలు అర్థం లేనివని పేర్కొన్నారు. ఉద్యోగుల సమిష్టి కృషి కారణంగానే.. ఫిట్మెంట్ మినహా అన్ని అంశాలు సాధించుకున్నామని చెప్పారు.  హెచ్‌ఆర్‌ఏ విషయంలో తెలంగాణకు సమానంగా తెచ్చుకున్నామని తెలిపారు. పీఆర్సీ ఐదేళ్లకు ఒకసారి ఇచ్చేలా చూశామని, అదనపు పెన్షన్‌, సీసీఏ కూడా వచ్చిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement