Thursday, May 2, 2024

లవ్ మ్యారేజ్ కాదు..అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటున్నాం: హీరో విష్ణు విశాల్‌

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాతో తమిళ హీరో విష్ణు విశాల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఇప్ప‌టికే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అయితే తామిద్దరిది లవ్ మ్యారేజ్ కాదని అందరిని అయోమయంలోకి నెట్టారు హీరో విష్ణు విశాల్. కాని అంతలోనే క్లారిటీ ఇచ్చారు విశాల్…గ‌తంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాన‌ని, కానీ, ఆ వైవాహిక జీవితం చేదు అనుభవాన్నే మిగిల్చిందని బాధ‌ప‌డ్డాడు. అందుకే గుత్తా జ్వాల, తాను ఒకరినొక‌రం అర్థం చేసుకుని వివాహం చేసుకుంటున్నామ‌ని చెప్పాడు. గుత్తా జ్వాల తన అనుభవాలను తనతో పంచుకుంద‌ని అన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement