Saturday, May 4, 2024

ఎనిమి కి బై చెప్పిన ఆర్య

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఎనిమి. కాగా ఈ చిత్రంలో విలన్ గా ప్రముఖ నటుడు ఆర్య నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆర్య పాత్ర మేరకు షూటింగ్ పూర్తి చేశాడట దర్శకుడు. చెన్నైలో నైట్ కర్ఫ్యూ ప్రారంభమయ్యే ముందు షూటింగ్ పూర్తి చేసి ఇంటికి పరుగెత్తుతున్నామని దర్శకుడు ఆనంద్ శంకర్ ట్వీట్ చేశాడు. ఇక ట్వీట్ పై స్పందించిన ఆర్య మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మీ ఎనర్జీ చిత్రీకరణ శైలి బాగుంది. త్వరలో మీతో కలిసి పని చేయాలని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ పెట్టాడు.

ఆర్య పాత్రకు సంబంధించిన షూటింగ్ ఆఖరి రోజు కావడంతో కేకు కట్ చేసి ఆర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్పెషల్ గా డిజైన్ చేసి రిలీజ్ చేశారు యూనిట్. ఇక ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్, ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.థమన్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement