Saturday, May 4, 2024

జమున పాత్రలో తమన్నా?… బయోపిక్ షురూ

ప్రస్తుతం ఇండస్ట్రీ లో బయోపిక్ ల హవా కొనసాగుతుంది. ఇప్పటికే సావిత్రి, ఎన్టీఆర్, ధోని వంటి ప్రముఖుల జీవిత కథ ఆధారంగా బయోపిక్ లో తెరకెక్కాయి. ఇప్పుడు మరో సీనియర్ నటి జమున బయోపిక్ ను తెరకెక్కించేందుకు రంగం సిద్దమవుతుంది. శివ నాగు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ బయోపిక్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే తమన్నాతో సంప్రదింపులు కూడా జరిగాయట.

జమున బయోపిక్ అంటే పెర్ఫామెన్స్‌తో పాటు ఎక్స్‌ప్రెషన్స్,‌, డాన్స్‌ అన్నింట నిరూపించుకున్న ఆల్‌రౌండర్‌ హీరోయిన్‌ అవసరమని కాబట్టి జమునగారి పాత్రలో తమన్నా అయితే బాగుంటుందని దర్శకుడు శివనాగు భావిస్తున్నాడట. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement