Friday, April 26, 2024

పిరియాడిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా సూర్య#42.. పాన్ ఇండియా మూవీ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్

విలక్షణమైన పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ని, అభిమానులను సంపాదించుకున్నాడు సూర్య‌. మాస్ కమర్షియల్ చిత్రాలతో టాప్ డైరెక్టర్‌గా ఎదిగాడు శివ.. వీరి కాంబినేషన్‌లో తెర‌కెక్కున్న సినిమా సూర్య‌#42 ఈ మ‌ధ్య‌నే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ శివ.. స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో వ‌స్తున్న సూర్య‌#42 మూవీకి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ ను ఇవ్వాల‌ (శుక్ర‌వారం) రిలీజ్ చేశారు మేక‌ర్స్.

ఈ సినిమా పిరియాడిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియన్ స్థాయిలో పది భాషల్లో సినిమాను రూపొందించబోతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. అంతేకాకుండా త్రీడీలో రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాను రెండు భాగాలుగా తెర‌కెక్కించే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాలో సూర్య‌కు జోడీగా దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

YouTube video

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement