Monday, May 6, 2024

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉప్పెన హీరో ?

ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్న ఈ యంగ్ హీరో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అయితే అందులో భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో ఒక సినిమా, నాగార్జున నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వైష్ణవ్. దశరథ్ కథతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట. కాగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement