Thursday, April 25, 2024

సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ ఇంకా ఆగట్లేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ రికార్డ్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బర్త్డే బ్లాస్టర్ పేరుతో రిలీజ్ అయిన టీజర్ 24 గంటల్లో 25.7 మిలియన్ల సాధించగా అదే స్పీడ్ ను ఇప్పుడు కూడా కొనసాగిస్తోంది. తాజాగా ఈ టీజర్ 33 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. అంతేకాకుండా 950 కె లైక్స్ కొల్లగొట్టింది.

ఇదే విషయాన్ని చెబుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు అర్జున్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ తో మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement