Monday, April 29, 2024

సినిమాటోగ్రఫీ కొత్త చట్టం పై సూర్య నిరసన గళం

కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 లోని సవరణలు త్వరలోనే తీసుకురాబోతుంది. ప్రముఖ దర్శక నిర్మాతలు శ్యామ్ బెనగల్, జస్టిస్ ముకుల్ ముద్గల్ తో కేంద్రం ప్రభుత్వం రెండు కమిటీలను వేసింది. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికను దృష్టిలో పెట్టుకొని సినిమాటోగ్రఫీ చట్టం 2021 ను తయారుచేసింది.

ఇదే విషయమై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచనలు ఇవ్వాలని కోరింది. కాగా దీనిపై తమిళ్ స్టార్ హీరో సూర్య నిరసన గళం విప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడటమే చట్టం. దాని స్వరతంత్రులను గొంతుకోసి చంపటం కాదు అంటూ చెప్పుకొచ్చారు సూర్య. అంతేకాకుండా గౌతమ్ వాసుదేవ మీనన్, కార్తీక్ సుబ్బరాజు కూడా నిరసన తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement