Monday, April 29, 2024

కొత్త సినిమా స్టార్ట్ చేసిన సుమంత్

హీరో సుమంత్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్ళు అవుతుంది. అయితే ఒకటి రెండు హిట్స్ మినహా చెప్పుకో దగ్గ విజయాలు సుమంత్ ను వరించలేదు. అయితే ఇటీవల కాలంలో డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు సుమంత్. తాజాగా మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు సుమంత్.

ఈ సినిమాకు కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే నేడు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement