Thursday, April 25, 2024

మురుగదాస్ తో బన్నీ ?

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ తన తర్వాత సినిమా గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే కొరటాల శివ, వేణు శ్రీరామ్, ప్రశాంత్ నీల్ ల పేర్లు తెరపైకి రాగా… కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ మేర అధికారిక ప్రకటన కూడా ప్రకటించింది.

దీంతో కొరటాలతో సినిమా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం అల్లుఅర్జున్ తమిళ దర్శకుడు మురుగదాస్ తో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనున్నారని సమాచారం. నిజానికి ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎప్పటి నుంచో సినిమా చేసేందుకు చాలా మంది నిర్మాతలు రెడీ అయ్యారు. కానీ కుదరలేదు. అయితే ఇప్పుడు ఈ విషయమై మరోసారి వార్తలు తెరపైకి వచ్చాయి. మరి ఈసారైనా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement