Thursday, March 28, 2024

బాలయ్య సినిమాలో ఫుల్ యాక్షన్ అండ్ ఫన్ !!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం అఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేయబోతున్నాడని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నందమూరి బాలకృష్ణను దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి కథ ను కూడా చెప్పారట. బాలయ్య కి కూడా ఆ కథ నచ్చిందట. అందుకే అనిల్ తో సినిమా చేయడానికి బాలయ్య ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.

అలాగే ఈ సినిమా ఫుల్ యాక్షన్ తో పాటు ఫన్ తో సాగే సినిమాగా ఉండనుందని తెలుస్తోంది. ఇక మామూలుగా అనిల్ రావిపూడి టైమింగ్, పంచ్ డైలాగ్ లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతానికి డైరెక్టర్ అనిల్ రావిపూడికి టాలీవుడ్ లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అనిల్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement