Sunday, April 28, 2024

ఎన్టీఆర్ యాక్టింగ్ కింగ్…హీరో శ్రీ విష్ణు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్య ప్రజల నుంచి సినీస్టార్ వరకూ కూడా ఎన్టీఆర్ ను ఎంతో మంది ఇష్ట పడుతూ ఉంటారు. అయితే తాజాగా హీరో శ్రీ విష్ణు ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ యాక్టింగ్ కింగ్ అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం శ్రీ విష్ణు నటిస్తున్న రాజరాజ చోర ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చోరుడి తో చాట్ అంటూ ట్విట్టర్ లో అందుబాటులోకి వచ్చారు శ్రీ విష్ణు.

దీంతో అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. అయితే ఓ అభిమాని ఎన్టీఆర్ గురించి అడగగా ఎన్టీఆర్ యాక్టింగ్ కింగ్ అంటూ రిప్లై ఇచ్చారు. దీనితో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement