Sunday, April 28, 2024

దక్షిణాది, ఉత్తరాది అని విడిగా చూడలేదు.. ఐశ్వ‌ర్యారాయ్

సినిమాల‌న్నీ భార‌తీయ సినిమాలే అని..తానెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విడిగా చూడలేదు అని తెలిపింది స్టార్ హీరోయిన్ ఐశ్వ‌ర్యారాయ్. ఏ సినిమా అయినా దాన్ని ఇండియన్ మూవీ అనే చూస్తాను. ఒక దాన్ని మరో ఒకటి ఓవర్ టేక్ చేస్తుందంటే నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఒకచోట అవకాశాలు రాకపోతే మరొక చోట వాటి కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుందంది. కళకు, కళాకారులకు ఎక్కడైనా గౌరవం ఉంటుంది. నేను సౌత్ లో పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేశాను. సినిమా రంగం చాలా గొప్పది అని తెలిపింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ నటించింది. ఈ సినిమాలో నందిని పాత్రలో నటించి మెప్పించింది. పొన్నియన్ సెల్వన్ సినిమాలో డ్యూయల్ పాత్రలో ఆకట్టుకుంది ఐశ్వర్య రాయ్. రీసెంట్ గా రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఐశ్వర్య నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement