Sunday, May 5, 2024

శ్రీరాముడు- గుహుల స్నేహం

శ్రీరామునికి నిషాదరాజు అయిన గుహుని పరిచయం అయోధ్యకాండలో 50వ సర్గతో మొ దలవుతుంది. అయోధ్య నుండి అరణ్యవాసానికి బయలుదేరిన సీతారామలక్ష్మణులు గంగానది ఒడ్డుకు చేరుకుంటారు. శ్రీరాముని ఆదేశానుసా రం సుమంత్రుడు రథాన్ని నిలుపుతాడు. అప్పు డు వాల్మీకి మహర్షి గుహుడి గురించి మొదటిసా రి ప్రస్తావిస్తారు. గుహుడు ఆ ప్రదేశానికి అధిపతి. అతడు శ్రీరామునకు భక్తుడు, ఆత్మీయుడు, ఉత్త మ పరిపాలకుడు. గంగానది ఒడ్డున సీతారాము లు వున్నారని తెలుసుకున్న గుహుడు అక్కడకు వస్తాడు. దూరంనుంచే గుహుడు రాకను చూసి రాముడు లక్ష్మణుడితో కలిసి ఎదురువెళతాడు.
గుహుడిని చూడగానే రాముడి అంతరం గంలో ఆనందం పొంగి పొర్లి తన దృఢమైన బా హువులలో బంధించాడు. ప్రాణ సఖుడిని కౌగ లించుకొని క్షేమ సమాచారాలు అడుగుతాడు.
గుహుడి కంట నీరు ఆగటంలేదు. ”రామా! మీకు స్వాగతము. ఈ రాజ్యమంతయు మీదే. మీరు మాకు ప్రభువులు. మేము పరిచారకుల ము. నీకు అయోధ్య ఎట్లో ఈ నగరమూ అంతే. నీకోసం నన్నేం చేయమంటావో చెప్పు. నీవంటి ప్రియాతి ప్రియమైన అతిధి మరెవ్వరికైనా దొరు కుతాడా!” అని పలికాడు. మా రాముడొస్తున్నా డని భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య పానీయాదు లతో కూడిన రాజులు ఆరగించేవి తీసుకువచ్చి గుహుడు తన ప్రియమిత్రుడికి అర్పించాడు. వాటిని సున్నితంగా తిరస్కరించాడు రాముడు.
”తానిప్పుడు వనవాస దీక్షలోవున్న విష యం గుర్తుచేసి, కావున పంచభక్ష్య పరమాన్నా లు స్వీకరించలేనని, తన అశ్వాలకి శ్రేష్టమైన మేత తెప్పించమ”న్నాడు. గుహుడు గుర్రాలకు ఆహా ర, పానీయాదులు అందచేశాడు.
రాముడు నారచీరను ఉత్తరీయంగా ధరిం చి సాయం సంధ్యను అర్చించి, లక్ష్మణుడు తెచ్చి న నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరించాడు.
చీకట్లు నలుదిశలను కప్పివేశాయి. రాము డు భార్యాసమేతుడై కటిక నేల మీద పడుకున్నా డు. అది చూసిన గు#హుడి దు:ఖ మాగలేదు.
లక్ష్మణుడికి పక్క ఏర్పాటుచేసి ”నీవు కూడా విశ్రమించవయ్యా! మేమందరమూ శ్రమజీ వు లము నీవు రాకుమారుడవు. రాముడి కోసం మే మంతా మేల్కొనే ఉంటాము నీవు హాయిగా నిదు రపో! రాముని రక్షణ బాధ్యత నాది నేను నమ్ము కొన్న సత్యముపై వట్టేసి చెపుతున్నాను నాకు రామునికన్నా ప్రియమైనది ఈ ప్రపంచంలో లేదు. నీవు చింత లేకుండా నిదురపో.”
అప్పుడు లక్ష్మణుడు గాద్గదికమైన గొంతు తో ”ఎవరు ధనుస్సు ఎక్కుపెట్టి నిలుచుంటే సమ స్త దేవగణాలు గజగజ వణికిపోతాయో! ఎవరి ధనుష్ఠంకారము దానవుల గుండెల్లో గుబులు పుట్టిస్తుందో! అట్టి జగదేకవీరుడు రాముడు నేల పై పవళిస్తే నాకు నిద్రెలా పడుతుంది? నా తండ్రి ఎన్నో నోములు వ్రతాలు యజ్ఞాలు చేస్తే ఆయన కు లభించినవాడు ఈ రాముడు. అట్టి పుణ్యాల ప్రోవు రాముడు నేడు నేలపై నిదురిస్తూ ఉంటే నేనెలా విశ్రమించగలను.” అన్నాడు.
ఇలా మాట్లాడుకుంటూ గుహుడు, లక్ష్మణు డు ధనుర్ధారులై సీతారాములను సంరక్షిస్తూ, సుమంత్రుడితో సంభాషిస్తూండగానే రాత్రి గడి చింది.మరుసటిరోజు ఉదయం సుమంత్రుడిని అయోధ్యకు వెళ్ళమని చెప్పి, గుహుడి నావనెక్కి గంగానది దాటుతారు సీతారామలక్ష్మణులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement