Thursday, May 2, 2024

Shruthi : శృతి మించ‌కుండానే సోగ‌సుల కుంప‌టి…

లోక నాయకుడు కమల్ హాసన్ స్థాయిలో కాదు కానీ ఆయన వారసురాలిగా శృతి హాసన్ కూడా స్టార్ గా ఎదిగింది. గ్లామర్ హీరోయిన్ గా శృతి హాసన్ సౌత్ లో అవకాశాలు అందుకుంటోంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. శృతి హాసన్ నటిగా ఎంత బిజీగా ఉంటుందో అదే స్థాయిలో మ్యూజిక్ తో కూడా గడుపుతూ ఉంటుంది. శృతి హాసన్ సోషల్ మీడియాలో, సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ ఒలకబోయడం మామూలే. గ్లామర్ విషయంలో శృతి హాసన్ ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ చూస్తే యువత పిచ్చెక్కి మైకంలో మునిగిపోతారు.శృతి హాసన్ ధరించిన బ్లాక్ డ్రెస్ చాలా వెరైటీగా ఉంది. శృతి హాసన్ ఎంతటి నాజూకు బ్యూటీనో ఈ పిక్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఓపెన్ షోల్డర్స్ టాప్ లో శృతి హాసన్ మెరుపులు మెరిపించే విధంగా హొయలు పోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement