Monday, May 6, 2024

చరణ్ సీత వచ్చేసింది..!!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరికీ సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలు ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ కూడా నటిస్తున్నారు.

కాగా తాజాగా అలియా భట్ పుట్టిన రోజు సందర్భంగా అలియా పాత్ర కు సంబంధించిన సీత లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ లుక్ లో అలియాభట్ దైవ సన్నిధి లో దీనంగా ఎదురు చూస్తూ కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement