Friday, April 26, 2024

ఫుల్ స్పీడ్ లో శాకుంతలం

పెళ్లి తర్వాత కూడా ఫుల్ స్పీడ్ లో వరుస సినిమాలను చేస్తూ మంచి జోష్ చూపిస్తోంది టాలీవుడ్ హీరోయిన్ సమంత. సమంత ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తోంది. ఇక ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ఈ సినిమా శకుంతల, దుష్యంతుడు మహారాజుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయబోతున్నారట చిత్ర యూనిట్. ఆపై వెంటనే థియేటర్స్ లో కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement