Friday, April 26, 2024

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సత్యదేవ్ తిమ్మరుసు

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధానపాత్రలో ప్రజల ముందుకు రాబోతున్న చిత్రం తిమ్మరుసు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఇక ఇటీవల ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు సత్యదేవ్. అలాగే నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ కూడా తెచ్చుకున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement