Monday, April 29, 2024

సంతోష్ శోభన్ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది!!

ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు సంతోష్ శోభన్. అయితే సంతోష్ శోభన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అందులో ఒకటి మారుతి దర్శకత్వంలో కూడా ఉంది. ఇందులో మెహరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నారు సంతోష్ శోభన్. స్వప్న సినిమాస్, మిత్రవింద మూవీస్ బ్యానర్ లపై ఈ సినిమాను ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అలాగే ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేస్తూ… మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement