Monday, April 29, 2024

చిరంజీవి కూతురు సినిమాలో సంతోష్ శోభన్ !!

పేపర్ బాయ్, ఏక్ మినీ కథ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు హీరో సంతోష్ శోభన్. ప్రస్తుతం సంతోష్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఓ ఓటిటి సినిమా చేయడానికి ఓకే చెప్పాడు సంతోష్. అలాగే ప్రేమ్ కుమార్ పేరుతో మరో సినిమా కూడా చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సంతోష్ శోభన్ హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. కాస్ట్యూమ్ డిజైనర్ గా పేరు తెచ్చుకున్న సుష్మిత తన భర్తతో కలిసి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. మొదటి ప్రయత్నం గా షూటౌట్ ఎట్ ఆలేర్ నిర్మించారు. సుస్మిత ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో చేయటానికి రెడి అయ్యారు. తమిళ చిత్రం 8 తోట్టక్కల్ ను రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాకు మాతృకకు దర్శకత్వం వహించిన శ్రీ గణేష్ దర్శకత్వం వహించబోతున్నారట. ఇందులో సంతోష్ హీరోగా నటించబోతున్నారట. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement