Thursday, May 2, 2024

ఆగస్టు 20న సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడీ’

హృదయం కాలేయం, కొబ్బరిమట్ట వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం ఆయన నటించిన బజార్ రౌడీ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంది రెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. ఇందులో సంపూర్ణేష్ బాబు సరసన మహేశ్వరి వడ్డీ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం… ఆగ స్టు 22న చిరంజీవి బర్త్ డే కి రెండు రోజుల ముందు ఆగస్టు 20న విడుదల చేయబోతున్నారు.

ఈమేర చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ….కథకు సంపూర్ణేష్ బాబు స్టైల్ ని యాడ్ చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దామని…దర్శకుడు నాగేశ్వరావు తనకున్న అనుభవాన్ని తెరపైకి తీసుకు వచ్చారని అన్నారు. మరి ఈ సినిమాతో సంపూర్ణేష్ బాబు ఎలా హిట్ ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement