Sunday, April 28, 2024

హరిహర వీరమల్లుపైనే నమ్మకాలు పెట్టుకుంటున్న నిధి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రంలో పాటు క్రిష్ దర్శకత్వంలో హరి హరి వీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఇటీవల ఓ అభిమాని ఈ సినిమా గురించి నిధి అగర్వాల్ ను అడగగా ప్రతి అంశం మనసును కదిలించే విధంగా ఉంటుందని తన కెరీర్ కు ఈ సినిమా పెద్ద బూస్ట్ అవుతుందని చెప్పుకొచ్చింది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇక కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. అలాగే ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement