Sunday, April 28, 2024

రికార్డ్స్ సృష్టిస్తోన్న ‘సామీ .. సామీ’ సాంగ్..24 గంటల్లో 8.5 మిలియన్ వ్యూస్..

ఈ మ‌ధ్య కాలంలో సినిమాలే కాదు వాటిలోని పాట‌లు రికార్డ్స్ ని సృష్టిస్తున్నాయి. ఇప్ప‌టికే అల వైకుంఠ‌పురం చిత్రంలోని ప‌లు పాట‌లు రికార్డ్స్ క్రియేట్ చేయ‌గా..ఇప్పుడు పుష్ప మూవీలోని సాంగ్ రికార్డ్స్ ని సృష్టిస్తోంది. ద‌ర్శ‌కుడు సుకుమార్ పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌..ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టిస్తున్నారు. భారీ బడ్జెట్ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు రాకెట్ ల జనంలోకి దూసుకుపోయాయి. రీసెంట్ గా వచ్చిన ‘సామీ .. సామీ’ సాంగ్ కూడా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. సాహిత్యం పరంగా చంద్రబోస్ ఈ పాటను జానపదానికి దగ్గరగా తీసుకెళ్లాడు. ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా వచ్చిన ‘దాక్కో దాక్కో మేక’కు 24 గంటలలో 8.3 మిలియన్ వ్యూస్ ను రాబట్టి కొత్త రికార్డును సెట్ చేసింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ‘సామీ .. సామీ’ పాట 24 గంటలలోగా 8.5 మిలియన్ వ్యూస్ ను రాబట్టి .. ఫస్టు సింగిల్ రికార్డును బీట్ చేసింది.

ఇలా ‘పుష్ప’ తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ వెళుతుండటం విశేషం. ఈ సినిమాలో సునీల్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అడవి నేపథ్యంలో .. ఎర్రచందనం అక్రమరవాణా చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథ ఇది. అడవి సమీపంలోని గిరిజన గూడెం .. ఆ గూడెంలోని శ్రీవల్లితో ముడిపడిన అందమైన ప్రేమకథ ఇది. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషన్ పాళ్లు పుష్కలంగా కనిపించనున్నాయనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement