Thursday, April 25, 2024

ఇంస్టాగ్రామ్ లో కోట్లు సంపాదిస్తున్న సమంత

అక్కినేని సమంత గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీ గా గడుపుతుంది. అలాగే వెబ్ సిరీస్ లలోను నటిస్తోంది. పెళ్లయిన తర్వాత కూడా ఇదే జోష్ తగ్గించకుండా చేస్తుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఫోటోలు, సినిమా అప్డేట్స్ ను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇక ఇంస్టాగ్రామ్ లో దాదాపు రెండు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న సమంత… ఇంస్టాగ్రామ్ ద్వారా కోట్లు సంపాదిస్తుంది. కాగా ఇప్పుడు సమంత వెతుక్కుంటూ కొన్ని బ్రాండ్ ప్రమోటర్స్ వస్తున్నారు. ఒక్కో బ్రాండ్ కి 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తోందట సమంత. ఒక పోస్ట్ కి అందుకుంటున్న లెక్క ఇది. ఈ లెక్కన నెలవారి ఆదాయం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement