Sunday, March 3, 2024

శ్రావణ మాసం వేళ మగువలకు బ్యాడ్ న్యూస్

శ్రావణ మాసం వేళ బంగారం కొనాలని భావిస్తున్న మగువలకు బ్యాడ్ న్యూస్ అందింది. కొన్ని రోజుల నుంచి వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.422 పెరిగి రూ.45,750కి చేరింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.43,600కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,560కి చేరింది.

కాగా అంత‌ర్జాతీయంగా విలువైన లోహాల డిమాండ్ పెరగ‌డ‌మే ఇవాళ దేశీయంగా బంగారం ధ‌ర పెరుగ‌డానికి కార‌ణ‌మ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. బంగారం బాటలోనే వెండి ధ‌ర‌లు కూడా ఇవాళ స్వ‌ల్పంగా పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కిలో వెండి ధ‌ర రూ.113 త‌గ్గి రూ.61,314కు చేరింది.

ఈ వార్త కూడా చదవండి: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement