Tuesday, May 21, 2024

ఓటీటీలో న‌వ్వులు పూయించ‌నున్న‌ సామ‌జవరగమన.. ఆహాలో స్ట్రీమింగ్‌కు రెడీ!

ఇటీవల రిలీజ్ అయ్యి అంద‌రినీ అల‌రించిన‌ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌. శ్రీవిష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ఈ సినిమా. యువ బ్యూటీ రెబా మోనికా జాన్ కథానాయికగా నటించింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ని రాజేష్ దండా నిర్మించారు.

కాగా, ఈ మూవీ అమెరికాలో $1 మిలియన్ గ్రాస్‌తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కాగా, ఈ సినిమా OTT ప్రీమియర్ ఆహాలో ఉంటుందని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ మూవీ జులై 28 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement