Wednesday, May 1, 2024

భాక్సాఫీస్ వద్ద ”సలార్” విధ్వంసం.. రెండు రోజుల్లో 295.7 కోట్లు

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో… నటించిన మ‌చ్ అవైటెడ్ పాన్ ఇండియాన్ మూవీ ‘‘సలార్ : సీజ్ ఫైర్’’. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది.

కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 295.7 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ప్రభాస్ నుండి ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ కు సలార్ ఫుల్ కిక్ ఇస్తుంది అని చెప్పాలి. ఈ సినిమాకి వీకెండ్‌తో పాటుగా క్రిస్మస్, న్యూ-ఇయర్ సెలవులు కూడా ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement