Monday, April 29, 2024

సెప్టెంబర్‌ లో ‘రూల్స్‌ రంజన్‌’

కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయిక.

‘రూల్స్‌ రంజన్‌’ సినిమాని స్టార్‌ లైట్‌ ఎంటర్‌-టైన్‌మెంట్‌ పతాకంపై దివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. అమ్రిష్‌ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు ఆకట్టు-కున్నాయి.

పాటలకు వస్తున్న అద్భుతమైన స్పందనతో ఉల్లాసంగా ఉన్న నిర్మాతలు తాజాగా -టైలర్‌ విడుదల తేదీని ప్రకటించారు. భారీ అంచనాలు నెలకొన్న ‘రూల్స్‌ రంజన్‌ ‘ సినిమా -టైలర్‌ వచ్చే శుక్రవారం అనగా ఆగస్టు 18న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ రెండో వారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్‌ చాహల్‌, వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు, హైపర్‌ ఆది, వైవా హర్ష, తదితరులు నటిస్తున్నారు. రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ

Advertisement

తాజా వార్తలు

Advertisement