Saturday, May 4, 2024

నాలో నేనే లేను….

కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. రత్నం కృష్ణ దర్శకుడు. ఏఎం.రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు.రింకు కుక్రెజ సహ నిర్మాత. నేహాశెట్టి నాయిక. ఈ చిత్రం నుండి ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ విడుదలచేశారు. తాజాగా ”నాలో నేనే లేను… ” పల్లవితో సాగే గీతాన్ని విడుదల చేశారు. అమ్రిష్‌ గణష్‌ స్వరపరిచారు. రాంబాబు గోపాల సాహిత్యం అందించారు. శరత్‌ సంతోష్‌ ఆలపించారు. వందశాతం ఇది వినోదాత్మక చిత్ర మని దర్శక, నిర్మాతలు చెప్పారు. ప్రస్తు తం చిత్ర నిర్మాణానంతర పనులు జరు గుతున్నాయి. జూలైలో సినిమాను విడు దల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నా మన్నారు. ఇతర పాత్రల్లో వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు, హైపర్‌ ఆది, వైవా హర్ష, విజయ్‌ పాట్కర్‌ నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement