Thursday, April 25, 2024

నీరా కేఫ్ ని సంద‌ర్శించిన.. ఏపీ మంత్రి జోగి ర‌మేష్

ఏపీ రాష్ట్ర‌గృహ‌నిర్మాణ‌శాఖ మంత్రి జోగి ర‌మేష్.. ఆయ‌న త‌న‌యుడు హైద‌రాబాద్ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ని సంద‌ర్శించారు. ప్ర‌కృతి సిద్ధ‌మైన, స్వ‌చ్ఛ‌మైన నీరాను రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందించ‌డం ప‌ట్ల‌ మంత్రి జోగి రమేష్ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసించారు. నీరా కేఫ్‌ను సందర్శించడానికి వ‌చ్చిన‌ మంత్రి జోగి రమేష్‌కు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం మంత్రి రమేష్‌ను శ్రీనివాస్ గౌడ్ శాలువాతో స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా నీరా కేఫ్‌లో లభ్యమవుతున్న ఉత్పత్తుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చలనచిత్ర నటుడు తల్వార్ సుమన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ప్రజా ప్రతినిధులు నాయకులు, గౌడ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement