Sunday, May 5, 2024

ఎన్టీఆర్ కూడా వచ్చేశాడు!!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ అలియాభట్ కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు.

కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. మొన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మొదట షూటింగ్ లో అడుగుపెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. బుధవారం ఎన్టీఆర్ సెట్ లో అడుగుపెట్టారట. అలాగే మరికొన్ని రోజుల్లో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ కూడా జాయిన్ కానుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement