Tuesday, April 30, 2024

అకీరానందన్ వాయిస్ కు బిగ్ ఫ్యాన్ నేను…రేణు దేశాయ్

నటి రేణు దేశాయ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రేణుదేశాయ్ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అకిరా తెలుగు మాటలు పట్టి పట్టి మాట్లాడుతాడని వినడానికి చాలా ముద్దుగా ఉంటాయని….అకిరా వాయిస్ కు బిగ్ ఫ్యాన్ ని నేను అంటూ చెప్పుకొచ్చింది.

ఇక అకిరా ను తెలుగు తెరకు ఎప్పుడు పరిచయం చేస్తారని అభిమానులు అడగగా.. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఇటువంటి సమయంలో పరిచయం చేయడం సరైంది కాదని చెప్పుకొచ్చింది. తప్పకుండా మీ ముందుకు తీసుకువస్తానని మీరంతా ఆశీర్వదించాలని చెప్పుకొచ్చారు రేణుదేశాయ్. గతంలో కూడా అకిరా ను హీరోగా పరిచయం చేయడానికి రెడీగా ఉన్నానని రేణు దేశాయ్ చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement