Friday, May 3, 2024

Regina : వ్యాపార వేత్త‌తో రెజినా పెళ్లి..

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రంలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. అంతకు ముందు గ్లామర్ రోల్స్ చ్చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించింది. ఇక చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది.

ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నివేత థామస్ నటించడం విశేషం. అయితే ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. అయితే తాజాగా రెజీనా గురించి వస్తున్న వార్తలు ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. రెజీనా త్వరలో ఓ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకోబోతున్నట్లు టాక్. ఆమె పెళ్లి కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు ఒకే చెప్పడంతో రెజీనా ఆ బిజినెస్ మ్యాన్ తో తన భర్తగా పొందబోతున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement