Sunday, May 19, 2024

WPL | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్‌..

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ మహిళల జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

అయితే ఈ సీజన్‌లో ఇది 10వ మ్యాచ్‌ కాగా, ఈ రెండు జట్లు ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. మరి ఈ మ్యాచ్‌తోనైనా గుజరాత్ జట్టు ఖాతా తెరుస్తుందో లేదో చూడాలి..

ఢిల్లీ క్యాపిటల్స్ అంచ‌నా జ‌ట్టు:

మెగ్ లానింగ్ (c), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా (WK), మిన్ను మణి, శిఖా పాండే, రాధా యాదవ్

గుజరాత్ జెయింట్స్ అంచ‌నా జ‌ట్టు:

- Advertisement -

బెత్ మూనీ (c & wk), లారా వోల్వార్డ్ట్, హర్లీన్ డియోల్/వేద కృష్ణమూర్తి, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆష్లీ గార్డనర్, దయాళన్ హేమలత, క్యాథరిన్ బ్రైస్, స్నేహ రాణా, తనూజా కన్వర్, మన్నత్ కశ్యప్, మేఘనా సింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement