Friday, May 10, 2024

Sakshi : పంట కోస్తున్నావా… గుండె కోస్తున్నావా సాక్షి…

సాక్షి అగ‌ర్వాల్. బిగ్ బాస్ తమిళ ఫేమ్ అంటే గుర్తుకు వ‌స్తుందేమో! సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాల్లోను పాపుల‌ర్. సాక్షి అగర్వాల్ తెలుగు వారికి అంతగా సుప‌రిచితం కాదు కానీ.. తమిళం, కన్నడ, మలయాళం చిత్రాలలో సుప్రసిద్ధ నటి కం మోడల్. న‌టిగా సాక్షి త‌మిళంలో అగ్ర హీరోల సినిమాల్లో అవ‌కాశం అందుకుంది.

విశ్వాసం, కుట్టి స్టోరీ, టెడ్డీ, సిండ్రెల్లా, అరణ్మనై 3,నాన్ కడవుల్ ఇల్లై వంటి చిత్రాలలో కూడా నటించింది. ది నైట్, పుర‌వై, 120 హ‌వ‌ర్స్, కురుక్కు వాజి అనే చిత్రాల్లో సాక్షి న‌టిస్తోంది. గెస్ట్ చాప్ట‌ర్ 2 అనే వెబ్ సిరీస్ లోను న‌టించింది. ఇవ‌న్నీ తదుప‌రి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. సాక్షి ఇప్పుడు సోష‌ల్ మీడియా క్వీన్ గాను పాపుల‌ర‌వుతోంది. ఎంకి పిల్ల కాన్సెప్టుతో గుబులు రేపుతున్న ఫోటోషూట్ ఇప్పుడు సంచ‌ల‌నంగామారింది. ఇలా కొడ‌వ‌లి చేత‌ప‌ట్టి గ‌ట్టు మీంచి పొలంలోకి దిగి వ‌రి కంకులు కోస్తుంటే త‌స్సదియ్యా.. కుర్ర‌కారు చూపుల‌న్నీ ఎంకి ఎద‌పైనే వాలిపోతున్నాయి..పంట కోస్తుందా… గుండెలు కోస్తుందా అంటూ యూత్ తెగ ఇదైపోతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement