Monday, May 6, 2024

పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైన‌ ర‌ష్మిక “రేయిన్ బో”.. 7నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌

నెష‌న‌ల్ క‌ర్ష్‌ రష్మిక మందాన్న రీసెంట్ గానే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి సైన్ చేసింది. డెబ్యూ డైరెక్ట‌ర్ శాంతరూబన్‌ దర్శకత్వంలో.. నటుడు దేవ్ మోహన్ మరో కీలక పాత్రలో ఈ సినిమా రాబోతుంది. KM. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించనున్నారు. కాగా, ఖాకీ, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం వంటి సూపర్ హిట్ సినిమాలని అందించిన‌ ప్ర‌ముఖ నిర్మాన సంస్థ‌ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించ‌నుంది.

ఇలాంటి క్రేజీ బ్యానర్ లో ‘రెయిన్‌బో’ అంటూ రష్మిక మందాన్న మెయిన్ లీడ్ గా ఓ క్రేజీ రొమాంటిక్ ఫాంటసీ డ్రామా రాబోతుండటం విశేషం. కాగా, ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమం ఈ రోజే ప్రారంభం అయ్యింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెర‌కెక్క‌నుంది. ఇక ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల (ఏప్రిల్) 7 నుంచి స్టార్ట్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement