Friday, May 10, 2024

రానా స‌మర్ప‌ణ‌లో ప‌రేషాన్…

‘మసూద’ ఫేమ్‌ తిరువీర్‌ పరేషాన్‌ సినిమాలో నటిస్తున్నాడు. రూపక్‌ రోన్సాల్డన్‌ దర్శకుడు. సిద్ధార్థ్‌ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీ-జర్‌కు మంచి స్పందన వచ్చింది. హీరో రానా దగ్గుబాటి సమర్పణలో జూన్‌ 2న ఈ చిత్రం విడుదల చేయనున్నట్లు- చిత్ర బృందం ప్రకటించింది.
తెలంగాణ లోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పావని కరణం, బన్నీ అభిరన్‌, సాయి ప్రసన్న, అర్జున్‌ కృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నా రు. ఈ చిత్రానికి వాసు పెండం ఛాయాగ్రహకునిగా వ్యవ హరిస్తుండగా యశ్వంత్‌ నాగ్‌ సంగీతం సమకూర్చు తున్నారు ఈ చిత్రంలో తిరువీర్‌. పావని కరణం, బన్నీ అభిరన్‌, సాయి ప్రసన్న, అర్జున్‌ కృష్ణ, బుద్దెర ఖాన్‌, రవి, రాజు బేడిగల, శృతి రాయన్‌, అంజి బాబు వాల్గమాన్‌, మురళీధర్‌ గౌడ్‌, పద్మ, వసంత తదితరులు నటిస్త్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement