Friday, May 10, 2024

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న.. రామ‌బాణం

హీరో గోపిచంద్ నటించిన చిత్రం రామ‌బాణం.. డింపుల్ హయతీ హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, ఖుష్బు, నాసర్‌, తరుణ్‌ అరోరా, వెన్నెల కిశోర్‌ ప్రధాన పాత్రల్లో కనిపించారు. మే 5న విడుదలైంది. రామబాణం ఓటీట రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. కాగా థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే దాదాపు రూ.8 కోట్ల‌కు గోపీచంద్‌ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనిలివ్ ద‌క్కించుకున్నట్లు సమాచారం. గోపీచంద్‌, శ్రీవాస్ కాంబినేషన్లో గతంలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్‌ హిట్‌ కావడంతో భారీ మొత్తానికి రామబాణం ఓటీటీ హక్కులను సోనిలివ్‌ సొంతం చేసుకుందట.థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన రామబాణం జూన్ 1 లేదా 3వ తేదీ నుంచి సోనిలివ్‌ లో స్ట్రీమింగ్‌ కానుందట. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే రామబాణం కూడా ఓటీటీలోకి వచ్చేస్తుందనమాట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. రామబాణం సినిమాలో గోపీచంద్‌, జగ్గూభాయ్‌ అన్నదమ్ములుగా నటించారు. అలాగే విక్కీభాయ్‌ అనే మాఫియా డాన్‌ పాత్రలో గోపీచంద్‌ నటించాడు. శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement