Thursday, May 2, 2024

ముస్లింలకు హిందువులు క్షమాపణలు చెప్పాలి – వర్మ

తన మాటలతో ట్వీట్లతో ఏదో ఒక వివాదాన్ని రేపుతూ ఉంటాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఏదో ఒక కారణం చూపెడుతూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉంటాడు. అయితే తాజాగా కుంభమేళాకు హాజరైన జనానికి సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేసి ఆహా… అద్భుతం. వావ్ ఎంత బాగుంది. ఇవి నా మాటలు కావు. కుంభమేళాలో జనసందోహాన్ని చూసినా కరోనా అంటున్న మాటలు. ఎన్ని లాక్ డౌన్స్ పెడితే గాని దీని వల్ల వ్యాప్తి చెందే కరోనా వైరస్ ను ఆపవచ్చో నాకు తెలియదు. కుంభమేళ….గుడ్ బై ఇండియా వెల్కమ్ కరోనా అంటూ మరో పోస్ట్ పెట్టాడు.

2020లో ఢిల్లీలో నిర్వహించిన జమాత్ సమ్మేళనం వలనే కరోనా వైరస్ వ్యాప్తి కారణమనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న కుంభమేళ ను చూస్తే బాహుబలి లా అనిపిస్తుంది. దానితో పోలిస్తే జమాత్ సమ్మేళనం షార్ట్ ఫిలింలా కనిపిస్తుంది. అప్పుడు ఏడాది తర్వాత కరోనా ప్రభావం ఇంత ఉంటుందా అనే విషయం వాళ్లకు తెలియకపోవచ్చు. కానీ తెలిసి మనం కుంభమేళా నిర్వహిస్తున్నాం. కాబట్టి హిందువులంతా ముస్లింలకు క్షమాపణలు చెప్పాలి అంటూ పేర్కొన్నాడు వర్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement