Monday, April 29, 2024

కొండారెడ్డి బురుజు ద‌గ్గ‌ర‌…

కర్నూలు కొండారెడ్డి బురుజు ఇది సినీ అభిమానులు అందరికీ తెలిసిన ప్రాంతం. కర్నూలు అనగానే దీనినే పేర్కొంటారు. ఒక్కడు మొదలు వీరసింహారెడ్డి విరకు సిని మాల షూటింగ్‌లు జరిగాయి. తాజాగా రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం షూటింగ్‌ ఇక్క డే జరుపుతున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ సినిమాలో చరణ్‌ ద్విపాత్రాభి నయం చేస్తున్నారు. చరణ్‌ లుక్స్‌ సినిమాపై అంచనాలు నెలకొల్పాయి.
ఇప్పటికే హైదరా బాద్‌ చార్మినార్‌ ప్రాం తంలో పాట చిత్రీకర ణ జరిపారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర కీలక షెడ్యూల్‌ శుక్రవారం ప్రారంభమైంది. దీనికి సంబం ధించిన ఫోటోలు ట్విట్టర్‌లో వైరల్‌ అవుతు న్నాయి. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సర్కారోడు అనే -టైటిల్‌ను పరిశీలనలో ఉంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కియారా నాయిక. థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement