Thursday, April 25, 2024

ఆదుకోవాలని అంబులెన్స్‌లో వచ్చి.. కలెక్టర్‌కు వినతి..!

నిజామాబాద్ : విధి ఆడిన ఆటలో ఓ కుటుంబం రోడ్డున పడింది. ఆపన్నాస్తం అందించాలంటూ అంబులెన్స్ సహాయంతో బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో తమ గోడును మొరపెట్టుకున్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన అల్వల పవన్ పెయింటింగ్ పని చేస్తూ, కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించేవాడు. గత ఏడు నెలల క్రితం ఆనంద్ నగర్ లో ఓ రెండంతస్తుల భవనంకు పెయింటింగ్ చేస్తుండగా ప్రమోదవశాత్తు కింద పడ్డాడు. దీంతో పవన్ నడుముకు దెబ్బ తగలడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇప్పటివరకు ఆసుపత్రిలో చూపించిన ఐదు లక్షల వరకు ఖర్చు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు 15 వేలు తనకు ఫిజియోథెరపీకే ఖర్చు అవుతుందని బాధితుడు పవన్ చెబుతున్నాడు. కుటుంబ పోషణ భారమై ఇంటి అద్దె చెల్లించలేక, బ్రతుకు దేవుడా అంటూ కాలం వెల్లదిస్తున్నామని పేర్కొన్నాడు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. తనకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారని ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని వేడుకుంటున్నారు. పని చేయలేక, భార్య పిల్లల ఆకలి తీర్చలేక దీనస్థితిలో ఉన్నానని కన్నీటి పర్యంతమయ్యాడు. అలాగే దాతలు సైతం ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహాయం చేసి నా కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement