Monday, April 29, 2024

హిమాలయాల్లో రజినీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ హిమాలయాల పర్యటనల్లో ఉన్నారు. ఆయనకు అధ్యాత్మిక భావాలు ఎక్కువనే విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు హిమాలయ్యాల్లో గడిపారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, కరోనా వల్ల ఆయన హిమాలయాల సందర్శనకు వెళ్లలేదని అంటున్నారు

తాజాగా హిమాలయాల్లో స్నేహితులతో కలిసి పర్యటిస్తున్నారు. ఓ వంతెనపై స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఫోటోలో తెలుపు కుర్తా, పైజామా, నుదుడిపై బొట్టు పెట్టుకుని రజినీ కనిపిస్తున్నారు.
రజినీకాంత్‌ నటించిన జైలర్‌ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకువచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement