Tuesday, October 15, 2024

Raj Tarun : రాజ్ త‌రుణ్ కొత్త మూవీ …

రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. రమేష్‌ కడుముల దర్శకుడు. మురళీధర్‌ రెడ్డి, కేఐటీఎన్‌. శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. రాశీసింగ్‌ నాయిక. చిత్ర ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు దర్శకులు నక్కిన త్రినాధరావు, మారుతి, నిర్మాతలు ఎస్‌కెఎన్‌, వివేక్‌ కూచిభొట్ల తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి మారుతి క్లాప్‌ ఇచ్చారు.

ప్రవీణ్‌ సత్తార్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. నక్కిన త్రినాధరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రమేష్‌ కడుముల మాట్లాడుతూ ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం. క్రైమ్‌ కామెడీ, స్వామిరారా, అందధూన్‌ చిత్రాల తరహాలో ఉంటుంది. కథ బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది అని చెప్పారు. చిత్ర నిర్మాత కేఐటీఎన్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కథ చాలా బాగా వచ్చింది. ఇదే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది.

- Advertisement -

మా సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. మాధవి అద్దంకి మాట్లాడుతూ సినిమా ప్లాట్‌ కొత్తగా ఉంటుంది. పాత్రలకు తగిన నటులు రాజ్‌ తరుణ్‌, రాశి సింగ్‌ అన్నారు. రాశీసింగ్‌ మాట్లాడుతూ కథ విన్నప్పుడు నా పాత్ర చాలా నచ్చింది అన్నారు. రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ ఇది చాలా మంచి కథ. క్రైమ్‌ కామెడీ జోనర్‌. ఇది నాకు ఇష్టమైన జోనర్‌ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్‌ చంద్ర, ఛాయాగ్రహణం ఆదిత్య జవ్వాడి.

Advertisement

తాజా వార్తలు

Advertisement