Sunday, April 28, 2024

Bourn vita హెల్త్ డ్రింక్స్ కాద‌ట‌.. కేంద్రం స్ప‌ష్టం

బోర్న్ వీటా హెల్త్ డ్రింక్స్ కేటగిరీ కిందకు రాదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కీలక సలహా జారీ చేసింది. బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నాయని హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి బోర్న్ వీటాను తొలగించాలని ఈ కామర్స్ కంపెనీలను ఆదేశించింది. వారి వెబ్‌సైట్‌లు, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలోని హెల్త్ డ్రింక్స్ కేటగిరీతో అన్నీ డ్రింక్స్, బేవ‌రేజ‌స్ హెల్త్ కేటగిరీ నుండి బోర్న్‌విటాను తీసివేయాలని సూచించింది.

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (సిపిసిఆర్) చట్టం 2005 లోని సెక్షన్ (3) కింద ఏర్పాటైన బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్‌సీపీసీఆర్ (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) ఇటీవల సీఆర్‌పీసీ 2005 చట్టంలోని సెక్షన్ 14 కింద విచారణ చేపట్టింది.

ఎఫ్‌ఎస్‌ఎస్ చట్టం, 2006, మోడర్జ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమ, నిబంధనలు హెల్త్ కేటగిరి డ్రింక్స్‌ను నిర్వచించలేదని కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది. బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నాయని, ఆమోదయోగ్య పరిమితులకు మించి ఎక్కువగా ఉన్నాయని ఎన్‌సీపీసీఆర్ చేసిన పరిశోధనలో తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement