Friday, April 26, 2024

పోర్న్ మూవీస్ లో నటించాలని రాజ్‌కుంద్రా అడిగాడు: పునీత్ కౌర్

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా ఫోర్న్ రాకెట్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే..అయితే తాను నిర్మిస్తున్న అడల్ట్ మూవీలో నటించేందుకు చాలా మందిని సంప్రదించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటీమణులు పూనమ్ పాండే, సాగరికా షోనా సుమన్ కూడా రాజ్‌కుంద్రాపై ఇలాంటి ఆరోపణలు చేశారు. తాజాగా పునీత్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాజ్‌కుంద్రా తనను హాట్‌షాట్స్ గురించి అడిగినట్లు చెప్పింది. రాజ్‌కుంద్రా తన అడల్ట్ యాప్ కోసం తనను కూడా అడిగాడని మరో మహిళ చెప్పింది. ఓసారి కుంద్రా తనకు నేరుగా ఇదే విషయం అడుగుతూ మెసేజ్ చేశాడని యూట్యూబర్ పునీత్ కౌర్ వెల్లడించింది.

అంతేకాదు ఈ విషయంపై తన ఇద్దరు స్నేహితులతో చర్చించిన ఓ వీడియోను కూడా ఆమె బయటపెట్టింది. మొదట్లో తాము రాజ్‌కుంద్రా అకౌంట్ హ్యాక్ అయిందేమో అనుకున్నట్లు పునీత్ చెప్పింది. గత ఫిబ్రవరిలో నటి పూనమ్ పాండే కూడా రాజ్‌కుంద్రాపై ఇవే ఆరోపణలు చేసింది. అటు మరో నటి సాగరికా షోనా సుమన్ అయితే అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. తనను నగ్నంగా ఆడిషన్ చేయాల్సిందిగా కుంద్రా అడిగినట్లు ఆమె ఆరోపించింది. 2019లో పూనమ్ పాండే బాంబే హైకోర్టులో రాజ్‌కుంద్రాపై కేసు ఫైల్ చేసింది.

ఇది కూడా చదవండి : వీడియో: వర్షాలకు కొట్టుకుపోయిన కార్లు..

Advertisement

తాజా వార్తలు

Advertisement