Friday, April 26, 2024

పుష్ప ఫస్ట్ సింగిల్ రికార్డ్ మాములుగా లేదు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. కాగా తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది.

అయితే ఈ ఫస్ట్ సింగిల్ అన్ని భాషలలో కూడా రికార్డులను బ్రేక్ చేస్తుంది. రిలీజైన ఈ సాంగ్ 182 నిమిషాలలో 400k లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. అన్ని భాషలలో కూడా ఐదు మిలియన్ లకు పైగా వ్యూస్ దక్కించుకుని ముందుకు దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement