Saturday, April 27, 2024

పూనకాలు మళ్లీ లోడింగ్.. OTT రిలీజ్‌కి రెడీ అయిన వాల్తేర్ వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి లెటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో చిరంజీవి, మాస్ మహరాజ రవితేజ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ.. OTT లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది.

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. కాగా, రేపటి నుంచి (ఫిబ్రవరి 27) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది ఈ మూవీ. OTTలో రిలీజ్ అవుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కమర్షియల్ గా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ.. OTT స్పేస్‌లో కూడా మంచి వసూల్లను రాబడుతుందని ఆశిస్తున్నారు మేకర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement