Friday, October 4, 2024

ప‌ల్స‌ర్ బైక్ సాంగ్ కి త‌గ్గ‌ని క్రేజ్

ప‌ల్స‌ర్ బైక్ సాంగ్ దూసుకుపోతోంది. ఈ మేర‌కు ట్వీట్ చేశారు మేక‌ర్స్. త్రినాథ్‌ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్‌ మీడియా సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో హీరోగా ర‌వితేజ న‌టించారు..హీరోయిన్ శ్రీలీల అందాలకు, డ్యాన్స్‌లకు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. రవితేజ ఎనర్జిటిక్‌ పర్‌ఫార్మెన్స్‌కు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్‌ సంగీత దర్శకుడు భీమ్స్‌కే ఇవ్వాలి.ఈ సినిమా పాటలు ఒకదానికి మించి మరొకటి చార్ట్‌ బస్టర్‌గా నిలిచింది. మొత్తంగా ఆల్భమే హైలేట్‌. చాలా కాలం తర్వాత ఒక సినిమాలో అన్ని పాటలు చక్కగా కుదిరాయంటే అది ఈ సినిమాకు మాత్రమే. కాగా ప‌ల్స‌ర్ బైక్ పాట వంద మిలియన్ల వ్యూస్‌ సాధించింది. అంటే ఇప్పటివరకు ఈ పాటను పది కోట్ల మంది వీక్షించారు. ఈ సాంగ్‌ రిలీజై మూడు నెలలవుతున్నా ఇంకా దీని జోరు తగ్గడం లేదు. ఏ ఫంక్షన్‌లో చూసిన ఈ పాటే. ఇక బరాత్‌లో ఈ పాట ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతలా పల్సర్‌ బైక్‌ సాంగ్‌ ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసింది. ఇక ఇదే సినిమాలోని జింతాక్‌ సాంగ్‌ ఇప్పటికే వంద మిలియన్‌ల వ్యూస్‌ దాటేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement